ఈ ఏడాది ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు!

by Satheesh |
ఈ ఏడాది ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యంగా తీరం తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 4వ తేదీ వరకు కేరళ భూభాగంలో ప్రవేశిస్తాయని అంచనా వేసింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. గతేడాది మే 29 నాటికే కేరళ తీరానికి చేరుకోగా.. ఈ ఏడాది మాత్రం నాలుగు రోజులు ఆలస్యం కానున్నాయి. భారత్‌లో తొలుత కేరళ భూభాగంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

మన దేశ వ్యవసాయ సాగు విస్తీర్ణంలో 42 శాతం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. నైరుతి రుతుపనాల రాకతో దేశంలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అందువల్ల నైరుతి రుతుపవనాల రాక కోసం రైతాంగం ఆశగా ఎదురు చూస్తుంటారు. కాగా దేశంలో ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ ఈసారి సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది.

Advertisement

Next Story