ఇకపై ఆ వాహనాలకు రాష్ట్రంలోకి ‘నో’ ఎంట్రీ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

by Satheesh |
ఇకపై ఆ వాహనాలకు రాష్ట్రంలోకి ‘నో’ ఎంట్రీ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకు జనాభా ఏ విధంగా పెరుగుతోందో కాలుష్యం కూడా అదే రేంజ్‌లో పెరుగుతోంది. మానవ వ్యర్థాలు, ప్లాస్టిక్‌, చెత్త పదార్థులతో నేల కలుషితమైపోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యావరణంతో పాటు ప్రకృతి రమణీయతను కాపాడటానికి ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇకపై రాష్ట్రంలోకి వచ్చే వాహనాల్లో చెత్త బుట్టను కంపలర్సీ చేసింది అక్కడి ప్రభుత్వం. వాహనంలో చెత్త బుట్ట లేని వెహికల్స్‌కు ఇకపై రాష్ట్రంలో అనుమతి లేదని స్పష్టం చేసింది. వాహనంలో చెత్తబుట్ట ఉందని నిర్ధారించుకున్నాకే స్టేట్‌లోకి ప్రవేశించేందుకు అధికారుల అనుమతి ఇవ్వనున్నారు.

టూరిస్ట్ వాహనాలు కూడా చెత్త బుట్టను లేదా బ్యాగ్‌ను తప్పనిసరిగా క్యారీ చేయాలింద్సేనని అక్కడి ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడంతో పాటు ప్రకృతి రమణీయతను కాపాడటానికే ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సిక్కిం అధికారులు తెలిపారు. సిక్కిం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశంలో వ్యర్థ పదార్థాలను అరికట్టేందుకు రాష్ట్రాలన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed