ర్యాన్ సంవేర్ అటాక్.. తగ్గుతున్న దాడులు, పెరుగుతున్న ప్రభావం

by Shamantha N |
ర్యాన్ సంవేర్ అటాక్.. తగ్గుతున్న దాడులు, పెరుగుతున్న ప్రభావం
X

దిశ, నేషనల్ బ్యూరో: ర్యాన్ సంవేర్ అటాక్స్ పై గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ షాకింగ్ విషయాలు తెలిపింది. గతేడాది సమారు 64 శాతం భారతీయ కంపెనీలపై ర్యాన్ సంవేర్ అటాక్ జరిగినట్లు తెలిపింది. ప్రతిఏడాది దాడుల సంఖ్య తగ్గుతున్నా.. బాధితులపై ప్రభావం మాత్రం రెట్టింపు అవుతోందని వివరించింది. సగటున 4.8 మిలియన్ల డాలర్ల వసూళ్లు జరుగుతున్నట్లు అంచనా వేసింది. 62 శాతం కేసుల్లో మిలియన్ డాలర్ల డిమాండ్ జరుగుతున్నట్లు తేలింది.

స్టేట్ ఆఫ్ ర్యాన్‌ సంవేర్ ఇన్ ఇండియా 2024 రిపోర్టును రిలీజ్ చేసింది సోఫోస్. 5 వేల ఐటీ కంపెనీ ఉద్యోగుల‌ను విచారించిన త‌ర్వాత నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. 2022లో జ‌రిగిన ర్యాన్‌ సంవేర్ దాడుల క‌న్నా.. 2023లో ఆ దాడుల సంఖ్య త‌గ్గిన‌ట్లు తేలింది. 2022లో 73 శాతం ఉన్న దాడులు జరగగా.. 2023 నాటికి అవి 64 శాతానికి ప‌డిపోయిన‌ట్లు తేలింది. దాడుల సంఖ్య త‌గ్గినా.. బాధితుల‌ నుంచి డ‌బ్బు వసూల్ చేయడం పెరిగిందన్నారు.

61 శాతం బాధితులు త‌మ డేటాను వారం రోజుల్లోగా రిక‌వ‌రీ చేసుకున్నారని ఆ రిపోర్టులో తేలింది. సుమారు 96 శాతం మంది దాడుల గురించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంట్లో 70 శాతం కేసుల‌కు విచార‌ణ అధికారుల స‌హ‌కారం అందుతోంది. ర్యాన్‌ సంవేర్ దాడులు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే కీల‌క‌మ‌ని సోఫోస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సునిల్ శ‌ర్మ తెలిపారు.

ర్యాన్‌ సంవేర్ సాఫ్ట్‌వేర్‌తో కంప్యూట‌ర్లు, స‌ర్వ‌ర్ల‌పై హ్యాక‌ర్లు అటాక్ చేస్తారు. అనుకున్న స‌మ‌యానికి డ‌బ్బులు ఇవ్వ‌కుంటే, ఫైల్స్ కోల్పోతార‌ని బెదిరింపులకు పాల్పడుతారు. ఇలానే డబ్బులు వసూలు చేస్తుంటారు.

Advertisement

Next Story