త్రిపురలో బీజేపీకి షాక్.. సీఏఏను వ్యతిరేకించిన మిత్రపక్ష పార్టీ

by samatah |
త్రిపురలో బీజేపీకి షాక్.. సీఏఏను వ్యతిరేకించిన మిత్రపక్ష పార్టీ
X

దిశ, నేషనల్ బ్యూరో: త్రిపురలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తిప్ర మోత పార్టీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకించింది. గిరిజన ప్రాంతాల్లో సీఏఏ అమలు చేయడానికి అనుమతించబోమని ఆ పార్టీ చీఫ్ ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దెబ్బర్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏపై ఇప్పటికీ సుప్రీంకోర్టు పోరాడుతున్నామని తెలిపారు. గిరిజన్ ప్రాంతాల్లో దానిని అమలు చేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. భూమిపై హక్కుల కోసం పోరాడుతున్నామని, త్రిపుర గిరిజనుల సమస్యల పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పార్టీ సంతకం చేసిన ఒప్పందంలో ఈ నిబంధన ఉందన్నారు. తిప్ర మోతపై ఆరోపణలు చేయడం సరికాదని, గిరిజనుల అభ్యున్నతిని ఎంతో పాటుపడుతున్నామన్నారు. కాంగ్రెస్ నాయకుడు సుదీప్ రాయ్ బర్మాన్ సీఏఏపై దెబ్బర్మ మౌనంగా ఉన్నాడని ఆరోపించిన నేపథ్యంలో తిప్రమోత నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, సీఏఏ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఇటీవలే త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి సాధికార కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story