- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్ల సంబంధానికి కారణం కామం కాదు.. ప్రేమే.. హైకోర్టు కీలక తీర్పు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : మైనర్ బాలికపై అత్యాచారం వ్యవహారంలో కేసును ఎదుర్కొంటున్న వ్యక్తికి బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ వ్యక్తితో కలిసి పారిపోయిన బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మైనర్ బాలిక, యువకుడి మధ్య సాగిన లైంగిక సంబంధం అనేది ప్రేమ వ్యవహారమే తప్ప.. కామం కానే కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న 26 ఏళ్ల యువకుడితో తనకు ప్రేమబంధమే ఉండేదని పోలీసులకు మైనర్ బాలిక సాక్ష్యం చెప్పింది. బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లుగా ఎలాంటి ఫిర్యాదులూ లేవన్న విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. యువకుడికి బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Advertisement
Next Story