- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన వేళ ముస్లింల సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు శరవేంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘట్టం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ యూపీ ముస్లింలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22న రామ్ లల్లా అయోధ్య రామ మందిరంలో కొలువుదీరనుండగా.. యూపీ రాజధాని లక్నోలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసి వేస్తున్నట్లు ప్రముఖ ముస్లిం సంస్థ జమియాతుల్ ఖురేష్ ప్రకటించింది. ఈ మేరకు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్‌కు సంస్థ ప్రతినిధులు కలిసి మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈనెల 22న ప్రాణప్రతిష్ట సందర్భంగా బిలోచ్ పురా, సదార్ కంట్, ఫతేగంజ్, లాతౌచి రోడ్ ప్రాంతాల్లో మాంసం విక్రయాలు జరపకూడదని నిర్ణయించామన్నారు. ఇండో-ఇస్లామిక్ సంస్థ స్పందిస్తూ మన దేశ ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు అయోధ్య వేదికగా కావాలని కాంక్షించారు. సంస్థ అధికార ప్రతినిధి అతార్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఈ అద్భుత ఘట్టాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదన్నారు. ఇక, ఈ నెల 22న ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్న విషయం తెలిసిందే.