PMO నుంచే ఒత్తిడి.. ఎంపీ మహువా మెయిత్రా సంచలన ఆరోపణలు

by GSrikanth |
PMO నుంచే ఒత్తిడి.. ఎంపీ మహువా మెయిత్రా సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌స‌భ‌లో ఆదానీకి సంబంధించిన ప్రశ్నలు వేసేందుకు డ‌బ్బు తీసుకున్నట్లు తృణమల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రాపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న వ్యాపారవేత్త హీరానందానీ ఓ అఫిడవిట్ రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ ఆమె త‌న ట్విట్టర్ వేదికగా స్పందించారు. పీఎంవో కార్యాల‌య అధికారులే వ్యాపార‌వేత్త ద‌ర్శన్ హీరానంద‌నిపై ఒత్తిడి తెచ్చి అఫిడ‌విట్ స‌మ‌ర్పించేలా చేసింద‌న్నారు. ఆయ‌న అఫిడ‌విట్‌లో ఉన్నవ‌న్నీ జోకుల‌ని పేర్కొన్నారు. పీఎంవోలో ఉన్న వ్యక్తులే ఆ అఫిడ‌విట్‌ను రూపొందించిన‌ట్లు ఆమె తెలిపారు. బీజేపీ క్రియేటివ్ సెల్‌లో ఉన్న వ్యక్తులు ఆ లేఖ రాసినట్లు ఆమె ఆరోపించారు. వైట్ పేప‌ర్ మీద అఫిడ‌విట్ ఉంద‌ని, అదేమీ లెట‌ర్‌హెడ్ కాదన్నారు. ఒక‌వేళ ఆ అఫిడ‌విడ్ నిజ‌మైతే దాన్ని ఎందుకు ట్వీట్ చేయ‌లేద‌ని ఆమె ప్రశ్నించారు.

Advertisement

Next Story