భార్యతో విడాకులు తీసుకున్న సచిన్

by Harish |
భార్యతో విడాకులు తీసుకున్న సచిన్
X

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన భార్య సారా అబ్దుల్లాతో విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన తాజా అఫిడవిట్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు. వీరు విడాకులు తీసుకున్నట్లు బయటకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను సచిన్ పైలట్ 2004లో వివాహం చేసుకున్నారు. వారికి ఆరన్, వెహాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులిద్దరూ తనపై ఆధారపడిన వారని పైలట్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఆయన టోంక్ నియోజకవర్గం నుంచి మంగళవారం నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు ముందు ఆయన భూటేశ్వర్ మహదేవ్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బడా కువాన్ నుంచి టోంక్ నగరంలోని పటేల్ చౌక్ వరకు తన మద్దతుదారులతో కలిసి ఊరేగింపు నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed