యువతకు భారీగా ఉపాధి మార్గాలు: ప్రధాని మోడీ

by Vinod kumar |
PM Modi Launches Multiple Digital Portals at Digital India week 2022 in Gandhi Nagar
X

న్యూఢిల్లీ : దేశ యువతకు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి మార్గాలు దొరుకుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి బాటలో ఉండబట్టే యువతకు జాబ్ ఛాన్స్‌లు ఇంతగా లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రాష్ట్రీయ రోజ్‌గార్‌ మేళాను ఉద్దేశించి ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. 51వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రదానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఎక్కువమందికి భద్రతా దళాల్లోనే జాబ్స్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. వారందరినీ ‘అమృత్‌కాల్‌ రక్షకులు’గా అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఆటోమొబైల్, ఫార్మా, పర్యాటకం, ఫుడ్‌ ప్రాసెసింగ్ రంగాల్లోనూ యువతకు భారీగా జాబ్ అవకాశాలు లభించబోతున్నాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed