ఘనంగా CISF జాగిలాల రిటైర్మెంట్ వేడుక (వీడియో)

by GSrikanth |
ఘనంగా CISF జాగిలాల రిటైర్మెంట్ వేడుక (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎనిమిదేళ్ల పాటు ఢిల్లీలోని సీఐఎస్ఎఫ్, డీఎమ్ఆర్సీలో పనిచేసిన జాగిలాలు రిటైర్ అయ్యాయి. ఢిల్లీ మెట్రో పరిధిలోని రైల్వే స్టేషన్‌లలో రాకీ, రోమియో, సోనీ అనే మూడు జాగిలాలు కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాయి. ఈ మూడు జాగిలాల రిటైర్మెంట్ కార్యక్రమాన్ని అధికారులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇంతకాలం సమర్థవంతంగా సేవలందించాయని వాటిని అధికారులు కొనియాడారు. వాటి సేవలకు గాను పతకాలను అందించి, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, మూడు జాగిలాలకు పదవీ విరమణ కోసం ఏర్పాట్లు చేయగా.. అనారోగ్యం కారణంగా సోనీ అనే జాగిలం ఈ వేడుకకు హాజరుకాలేదు. సోనీ తరపున ట్రైనర్‌ ఆ అవార్డును స్వీకరించారు. ఈ జాగిలాలు రోజుకు సగటున 800 వరకు లగేజీలను తనిఖీ చేస్తాయని సీఐఎస్​ఎఫ్​ వెల్లడించింది. మూడు శునకాలకు సత్కారం చేసిన తర్వాత.. వాటిపై గులాబీ పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు.

Advertisement

Next Story