- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
INDIA BLOC : ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తొలగించండి.. ఆప్ సంచలన డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో : ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తొలగించాలని ఇతర పార్టీలను సంప్రదిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ ఈ పరిణామం కూటమిలో పెనుదూమారం రేపింది. కేజ్రీవాల్ ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలు ఉనికిలో లేవని ఢిల్లీలోని రెండు విభాగాలు తిరస్కరించడంతో ఢిల్లీ యూత్ కాంగ్రెస్ బుధవారం ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను ‘దేశ వ్యతిరేకి’ అని అజయ్ మాకెన్ అనడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో మాకెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు ఇస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోని పక్షంగా కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి నుంచి వెంటనే తొలగించాలని సంజయ్ సింగ్ కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు బీజేపీ భరిస్తోంది.. : ఢిల్లీ సీఎం అతిషి
సందీప్ దీక్షిత్ సహా కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీజేపీ భరిస్తోందని ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆమ్ ఆద్మీని దేశ వ్యతిరేక పార్టీగా భావిస్తే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు కలిసి పోటీ చేశారని ఆమె ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు లోపాయికారి ఒప్పందం చేసుకుని డిల్లీలో ఆప్‌ను ఓడించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఆప్‌పై వరుసగా దాడులు చేయడంతో నాలుగో సారి సైతం ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్‌తో పొత్తు పెట్టుకుని తప్పు చేసిందని అజయ్ మాకెన్ అన్నారు. 2013లో ఆప్‌కి కాంగ్రెస్ మద్ధతు ఇచ్చి తన ఉనికిని కోల్పోయిందని అజయ్ మాకెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.