- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటకలోని చామరాజనగర్లో ఏప్రిల్ 29న రీ పోలింగ్..!
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 29న రీపోలింగ్ జరగనుంది. చామరాజనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హనూర్‌లోని పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది ఈసీ. చామరాజనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ అధికారి నివేదికల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది ఈసీ. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏప్రిల్ 26న పోలింగ్ స్టేషన్ నంబర్ 146 పరిధిలోకి వచ్చే పోలింగ్ చెల్లదు. కమిషన్ సూచనల మేరకు ఏప్రిల్ 29న 146 పోలింగ్ స్టేషన్‌లో రీ పోలింగ్ జరగనున్నట్లు తెలిపింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలా వద్దా అనే అంశంపై రెండు వర్గాల ప్రజల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. చామరాజనగర జిల్లాలోని ఇండిగనాథ గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంలు ఈ ఘర్షణలో ధ్వంసం అయ్యాయి. సరైన మౌలిక సదుపాయాలు లేవని ఆరోపిస్తూ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే స్థానిక అధికారుల హామీలు, ప్రయత్నాల అనంతరం పోలింగ్ కొనసాగింది. అయితే ఓటు వేయాలని ఒకరు, బహిష్కరించాలని మరొకరు ఘర్షణపడి..ఈవీఎంలు ధ్వంసం చేశారు. రాళ్లదాడికి కూడా పాల్పడ్డారని తెలిపారు అధికారులు.