- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భార్య టార్చర్ చేస్తోంది.. మెయింటెనెన్స్ ఇప్పించండి.. కోర్టుకెక్కిన మాజీ మంత్రి
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ మాజీ మంత్రి, భరత్పూర్ రాజకుటుంబీకుడు విశ్వేంద్ర సింగ్ తన భార్య, కొడుకుపై సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య, కొడుకు నుంచి మెయింటెనెన్స్ ఇప్పించాలని కోర్టుకెక్కారు. వారు తనను కొడుతున్నారని, తగినంత ఆహారం ఇవ్వడం లేదని, చివరకు ప్రజల్ని కలిసేందుకు కూడా అనుమతించలేదని ఆయన ఆరోపించారు. మాజీ ఎంపీ విశ్వేంద్ర సింగ్ తన భార్య దివ్యాసింగ్, కొడుకు అనిరుధ్ సింగ్సై సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
మోతీ మహల్ లోని తన ఇంటిన వదిలి వెళ్లాల్సి వచ్చిందన్నారు విశ్వేంద్ర సింగ్. కొన్నిసార్లు గవర్నమెంట్ గెస్ట్ హౌజ్ ల్లో, కొన్నిసార్లు హోటళ్లలో ఉండాల్సి వస్తోందన్నారు. ఇంట్లో తన భార్య, కుమారుడితో కలిసి జీవించడం సాధ్యం కాదని తెలిపారు. ఒకే గదికి పరిమితమవుతున్నట్లు వాపోయారు. భార్య, కుమారుడు తనకు రూ.5 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. వారిద్దరు తనను చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించాడు. తనని చంపి..ఆస్తుల్ని లాక్కోవడం వారి లక్ష్యమని దరఖాస్తులో ఆరోపించారు. భవిష్యత్తులో వారి ప్రవర్తన మారుతుందని భావించానని, అది జరగలేదని, తన గదికి తాళం వేసి బలవంతంగా తనను బయటకు గెంటేశారని పేర్కొన్నారు.
తాను హార్ట్ పేషెంట్‌ని అని, చికిత్స సమయంలో తనకు రెండు స్టెంట్స్ అమర్చారని, తాను ఈ టెన్షన్ భరించలేనని పేర్కొన్నారు. 2021, 2022 సంవత్సరాల్లో తనకు రెండుసార్లు కరోనా వచ్చిందన్నారు. తన భార్య, కుమారుడు తనకు ఎలాంటి సాయం అందించలేదని ఆరోపించారు. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు తన సొంతమని.. కానీ వాటిని ఇవ్వట్లేదని అన్నారు. వారు వీలునామా పేపర్లు, రికార్డులు చించేశారని.. బట్టలు బావిలో పారేశారని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని కోర్టుని కోరారు. మోతీ మహల్ ప్యాలెస్ తనకు ఇచ్చేయాలని కోరారు.
అయితే, ఈ ఆరోపణల్ని మాజీ మంత్రి భార్య, కొడుకు కొట్టిపారేశారు. దీనిపై అనిరుధ్ స్పందించారు. ఎస్డీఎం కోర్టుపై ఒత్తిడి తేచ్చే వ్యూహం ఇది అని పేర్కొన్నారు. కోర్టు, న్యాయమూర్తులు న్యాయంగా వ్యవహరిస్తారని తనకు, తన తల్లికి విశ్వాసం ఉందని అన్నారు. ఈ విషయం కొత్తది కాదని, మార్చి 6 2024 నుంచి ఇది కొనసాగుతూనే ఉందని సోషల్ మీడియాలో తెలిపారు. నిజమైన బాధితులము తామే అని చెప్పుకొచ్చారు.