- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మండు వేసవిలో శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ.. వర్షాలు దంచుడే..
దిశ, నేషనల్ బ్యూరో: ఎండ వేడితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం లా నినో పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని, ఈ సారి వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా భారత్‌లో కురిసే వర్షాలకు ప్రధాన ఆధారం నైరుతి రుతుపవనాలే. ఇవి గత ఏడాది కన్నా ముందుగానే ప్రవేశించి, దేశంలో విస్తారమైన వర్షాలను కురిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు.
హిందూ మహాసముద్రంపై ఉన్న సానుకూల పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రంపై లా నినో ఏర్పాటును సూచిస్తుంది. దీని వలన జులై నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల వలన దేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా వేడి విపరీతంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రారంభమై సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడం ప్రజలకు ఎంతో ఊరటనిస్తుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నుండి సెప్టెంబర్ వరకు 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయి