Independence Day: పదేళ్ల తర్వాత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతిపక్షనేత

by Shamantha N |
Independence Day: పదేళ్ల తర్వాత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతిపక్షనేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్రకోట దగ్గర జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్యారిస్ ఒలింపిక్ పతవిజేతల పక్కనే ఆయన కూర్చున్నారు. భారత హాకీ సభ్యులు, షూటర్ మను బాకర్ సహా క్రీడాకారుల పక్కనే ఆయన కూర్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, గత పదేళ్లలో ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం ఇదే తొలిసారి. అయితే, రాహుల్ గాంధీ సీటింగ్ పై ప్రొటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడికి, కేంద్రమంత్రులుతో పాటుగా ముందువరుసలో సీటు కేటాయిస్తారు. ఈ కార్యక్రమంలో ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా, ఎస్ జైశంకర్ ఉన్నారు.

రాహుల్ గాంధీ సీటింగ్ పై చర్చ

రాహుల్ గాంధీ సీటింగ్ ఏర్పాటుపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలు కేటాయించడంతో కాంగ్రెస్ ఎంపీని వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమ నిర్వహణ, సీటింగ్ ప్లాన్ లను రూపొందేం బాధ్యత రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతే. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్షనేతకు మొదటి వరుసలోనే సీటు ఇస్తుంది. ఇకపోతే, అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత సోనియాగాంధీకి ఎప్పుడూ ముందువరుసలోనే సీటు కేటాయించేవారు.

Advertisement

Next Story