Rahul Gandhi: చెప్పులు కుట్టేవ్యక్తికి సర్ ప్రైజ్.. కుట్టుమిషన్ అందజేత

by Shamantha N |
Rahul Gandhi: చెప్పులు కుట్టేవ్యక్తికి సర్ ప్రైజ్.. కుట్టుమిషన్ అందజేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ కి చెందిన చెప్పులు కుట్టే వ్యక్తికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. శుక్రవారం రామ్ చేత్ అనే వ్యక్తితో రాహుల్ మాట్లాడారు. కాగా.. రెండ్రోజులకే ఆయనకు కుట్టుమిషన్ పంపించారు. ఈ మేరకు, యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్థి సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. “ ప్రజలనాయకులు ఒక చెప్పులు కుట్టే కుటుంబాన్ని కలుసుకున్నాడు. వారి బాధ అర్థం చేసుకుని ఒక కుట్టు మిషన్ ని పంపారు.దీని ద్వారా వారి పని సులభతరం అవుతుంది. ప్రజల బాధలను అర్థం చేసుకోవడం, వారికి అండగా నిలవడం, వారికి సహాయం చేయడమే అసలైన నాయకుడికి నిర్వచనం.” అని ఎక్స్ లో పోస్టు చేశారు. చెప్పులు కుట్టే వ్యక్తికి ఆధునిక యంత్రాన్ని అందించడం ద్వారా రాహుల్ గాంధీ పేదలు, అణగారిన వర్గాల వారికి అండగా ఉంటాననే సందేశాన్ని యావత్ దేశానికి తెలిపారని యూపీ కాంగ్రెస్ నేత మనీష్ హింద్వి అన్నారు.

చెప్పులు కుట్టే వ్యక్తితో మాట్లాడిన రాహుల్ గాంధీ

సుల్తాన్‌పూర్ సివిల్ కోర్టు నుండి లక్నోకు వెళుతుండగా.. రాహుల్ గాంధీ కాన్వాయ్ గుప్తర్‌గంజ్‌లోని ఎమ్మెల్యే నగర్‌లోని ఓ చెప్పుల దుకాణం దగ్గర ఆగారు. ఆ షాపులో కూర్చుని చెప్పులు కుడుతున్న రామ్ చైత్ వ్యక్తితో మాట్లాడారు. ఈ సమయంలో.. రాహుల్ గాంధీ చెప్పులు కూడా కుట్టారు. పనిలో ఎదురయ్యే సమస్యల గురించి కూడా తెలుసుకుని.. వారికి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాతే కుట్టుమిషన్ ని రామ్ చైత్ కి గిఫ్ట్ గా పంపారు.

Advertisement

Next Story

Most Viewed