తుగ్లక్ లేన్‌లో తన ఇంటిని తిరిగి పొందిన రాహుల్ గాంధీ..

by Mahesh |   ( Updated:2023-08-09 07:17:13.0  )
తుగ్లక్ లేన్‌లో తన ఇంటిని తిరిగి పొందిన రాహుల్ గాంధీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మోడీ ఇంటి పేరు..పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడిన తర్వాత పార్లమెంట్ సభ్యత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం గాంధీ ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో ఉంటున్న ఇంటిని కూడా కాలి చేయాల్సి వచ్చింది. పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించడంతో సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్‌ గాంధీ దిగువ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. కాగా తాజాగా లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు వేసిన ఒక రోజు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి 12, తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మేరా ఘర్ పురా హిందుస్థాన్ హై (దేశం మొత్తం నా ఇల్లు)" అని గాంధీని ఎగతాళి చేశారు.

Advertisement

Next Story