- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒలింపిక్స్ టైంలో ఉక్రెయిన్‌లో సీజ్‌ఫైర్.. ఫ్రాన్స్ ప్రతిపాదనకు పుతిన్ నో
దిశ, నేషనల్ బ్యూరో: ఒలింపిక్స్ టైంలో ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అంతేకాకుండా, ఒలింపిక్స్ లో రష్యా అథ్లెట్ల పట్ల అన్యాయంగా ప్రవర్తించాయని చెప్పుకొచ్చారు.
పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ సందర్భంగా "ఒలింపిక్ సంధి" కోసం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యూయేల్ మాక్రాన్ పిలుపునిచ్చారు. అయితే, ఫ్రాన్స్ అధ్యక్షుడి ఆలోచనకు మద్దతు ఇస్తున్నారా అని పుతిన్ ని అడగగా.. కాల్పుల విరమణ చేపట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చైనా పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రీడా అధికారులు ఒలింపిక్ చార్టర్ సూత్రాలను పాటించట్లేదని ఆరోపించారు. తమ బ్యానర్, జెండా, జాతీయగీతంతో తమ అథ్లెట్లు ప్రదర్శనలు ఇచ్చేందుకు క్రీడా సంస్థలు అనుమతించడంలేదని అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి ఒప్పందానికి ఎవరూ రాలేదని తెలిపారు.
ఉక్రెయిన్‌లో రష్యా కాల్పుల విరమణ చేపట్టేందుకు ఒలింపిక్ సంధి గురించి తన ఆలోచనను ప్రకటించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఉక్రెయిన్‌తో సహా అన్ని వివాదాల్లో సంధి ఆలోచనకు మద్దతు ఇచ్చినందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు మాక్రాన్ ధన్యవాదాలు తెలిపారు.