- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పూణే లగ్జరీ కారు కేసు.. మద్యం తాగినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్న బాలుడు
దిశ, నేషనల్ బ్యూరో: పూణే పోర్ష్ కారు ప్రమాద కేసులోమరో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి తాగి ఉన్నట్లు మైనర్ పోలీసుల ముందు అంగీకరించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. జరిగిన సంఘటనలన్నీ తనకు పూర్తిగా గుర్తులేదని విచారణలో అధికారులకు తెలిపాడు. ఇదిలా ఉండగా, ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసులో మైనర్ తల్లిదండ్రులు శివానీ, విశాల్ అగర్వాల్ లకు పూణే కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. జూన్ 5 వరకు వారు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. వీరిపై మైనర్ నిందితుడి బ్లడ్ శాంపిల్స్ తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
3 వేర్వేరు కేసులు నమోదు
మే 19న పూణేలోని కళ్యాణి నగర్‌లో బైక్‌పై వెళ్తు్న్న ఇద్దరు టెకీలను మైనర్ కారుతో ఢీకొట్టి చంపాడు. ఆ తర్వాత బాలుడు తాగి లేడని చెప్పేందుకు బ్లడ్ శాంపిల్స్ ని మార్చారు. వైద్యపరీక్షల కోసం ససూన్ హాస్పిటల్ కు తీసుకొచ్చినప్పుడు.. బాలుడి బ్లడ్ శాంపిల్స్ ని అతడి తల్లి శాంపిల్స్ తో మార్చారు. దీనికోసం డాక్టర్లకు లంచం ఇచ్చినట్లు తేలింది. ఈ ఘటనలో పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించినది ఒకటి, మైనర్ బాలుడికి మద్యం అందించిన బార్‌పై రెండోది, నిందితుడి కుటుంబం.. వారి డ్రైవర్‌ని ఈ కేసులో ఇరికించేందుకు యత్నించినట్లు మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలుడి తల్లిదండ్రులతో పాటు అతని తాతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ మార్చినందుకు ససూన్ హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్లు, ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.