- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Priyanka Gandhi: భావోద్వేగాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని.. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని ఇతర ప్రాంతాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకే బీజేపీ జమ్మూ కశ్మీర్‌ను ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. జమ్మూలోని బిష్నాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బీజేపీ నాయకులు కశ్మీర్‌ను రాజకీయ పావుగా మార్చుకున్నారని, ఈ ప్రాంత ప్రజల కోసం ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. కశ్మీర్ ప్రజల నిజమైన ఆందోళనలపై మోడీకి సీరియస్‌నెస్ లేదని, కశ్మీరీల హక్కులు, భూమి, ఉపాధి వంటి సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో రిలయన్స్ దుకాణాలు తెరుచుకుంటున్నాయని, చిన్న వ్యాపారాలు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్దరించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తో్ందని నొక్కి చెప్పారు. జమ్మూ ప్రజల అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి సరైన విజన్ ఉందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.