భారత స్టాక్ మార్కెట్లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-05-20 11:13:43.0  )
భారత స్టాక్ మార్కెట్లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు వస్తాయనే దానిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో ముదుపర్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడి కోట్ల సంపాద ఆవిరి అవుతోంది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తోందని.. జూన్ 4న ఫలితాల వెల్లడి తర్వాత దేశ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతాయని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డ్‌లు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపు, మెజార్టీపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు ఓడిదొడుకులు ఎదుర్కొంటున్నాయన్న వార్తలను ఈ సందర్భంగా మోడీ ఖండించారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సామాన్యుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story