- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్ న్యూస్.. వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో గత నెల చివర్లో వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వయనాడ్ ప్రాంతంలోని మోప్పాడ్ గ్రామంలో ఒక్కసారిగా భారీ వరదలు వచ్చాయి. దీంతో పర్వత ప్రాంతాలు కావడంతో ఒక్కసారిగా ల్యాండ్ సైడ్ అయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకొని దాదాపు 400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా నేటికి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలియ జేయాలని ప్రధాని మోడీ సీఎం పినరయి విజయన్ కు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఇన్ని రోజులు సభలో ఉన్న ప్రధాని మోడీ.. ఈ నెల 10న వయనాడ్ లో వరదలు, ల్యాండ్ స్లైడ్ అయిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా కేరళ వెళ్లి.. అక్కడ ఏరియల్ వ్యూ ద్వారా ప్రధాని మోడీ పరిక్షించనున్నట్లు తెలుస్తుంది.