- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాసేపట్లో ప్రధానిగా మోడీ ప్రమాణం.. ఈసారి వీరికి మంత్రియోగం లేదా?
దిశ, వెబ్‌డెస్క్: మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మరికొన్ని గంటల్లో కొలువు తీరనున్నది. రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు దాదాపు 50 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కగా ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలకు చోటు లభించింది. వీరందరికీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం వెళ్ళడంతో ప్రధానితో జరిగే తేనీటి విందుకు హాజరయ్యేందుకు లోక్‌కల్యాణ్ మార్గ్ లోని నివాసానికి వెళ్ళారు. తెలంగాణ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఈటల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించే అవకాశమున్నది. ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి నుంచి గెలిచిన పురంధేశ్వరి లోక్‌సభ స్పీకర్‌గా నియమితులయ్యే అవకాశమున్నది. వీరిద్దరి పేర్లకు కేంద్ర మంత్రివర్గం జాబితాలో స్థానం లభించకపోవడంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్నందున ఆ కూటమి భాగస్వామ్య పక్షాలకు సైతం చోటు లభించింది. అప్నాదళ్, శివసేన (ఏక్‌నాధ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), లోక్ జనశక్తి పార్టీ (పాశ్వాన్ వర్గం), రాష్ట్రీయ లోక్‌దళ్, రిపబ్లికన్ పార్టీ సహా కీలక భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ పార్టీలకు చెందివారికీ మంత్రివర్గంలో చోటు దక్కింది. గత ప్రభుత్వంలో కేంధ్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన పలువురు రాజ్యసభ సభ్యులకూ ఈసారి చాన్స్ వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారికి పోర్టుఫోలియోలను ప్రకటించనున్నట్లు ప్రధాని కార్యాలయ వర్గాల సమాచారం. వెంటనే 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో కార్యక్షేత్రంలోకి దూకాలని, పెండింగ్ స్కీములను మళ్ళీ పరుగుపెట్టించాలని, ఇంతకాలం ఎలక్షన్ కోడ్‌తో ఆగిపోయిన పనులను పునఃప్రారంభించాలని పీఎంఓ వర్గాలు వీరికి సూచించాయి.
గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన స్మృతి ఇరానీ, అనురాగ్ ణాకూరస్, రాజీవ్ చంద్రశేఖరన్, అజయ్ తేని, నిశిత్ ప్రామణిక్, సాధ్వి నిరంజన్ జ్యోతి తదితరులకు ఇంకా ఫోన్ కాల్ రాకపోవడంతో వీరికి ఈసారి మంత్రియోగం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైకు సైతం ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు వార్తలు వచ్చినా ఆయనకు ఫోన్ కాల్ రాకపోవడంతో సస్పెన్స్ నెలకొన్నది. కేరళ నుంచి బీజేపీ గెలిచిన ఏకైక స్థానానికి (త్రిసూర్) ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటుడు సురేష్ గోపికి ఈసారి చాన్స్ దక్కింది.