Food poisoning : ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమం

by Sridhar Babu |
Food poisoning : ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమం
X

దిశ, వాంకిడి : మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో వాంకిడి మండలంలోని సావాతి గ్రామానికి చెందిన శైలజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఆమె మంచిర్యాల మాక్స్ కేర్ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. ఆమెతో పాటు మరో ముగ్గురు పిల్లలు చికిత్స పొందుతున్నా వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అలాగే మరో 12 మంది విద్యార్థులు ఆసిఫాబాద్ లైఫ్ లైన్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన హెచ్ఎం, వార్డెన్లను సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పీఓ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed