- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పది రూపాయల నాణేల పై అవగాహన కల్పించాలి..'
దిశ, వీపనగండ్ల : బ్యాంకుల నుంచి పొందిన పది రూపాయల నాణ్యాలు వినియోగదారుల నుంచి వ్యాపారస్తులు తీసుకోకపోవడంతో 10 రూపాయల నాణ్యాలు చెల్లవా ! అంటూ వినియోగదారులు వాపోతున్నారు. స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వినియోగదారులకు డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళగా అందులో ఒక వెయ్యి రూపాయలు పది రూపాయల నాణ్యాలను బ్యాంకు సిబ్బంది వినియోగదారులకు అందిస్తున్నారు. బయట దుకాణదారులు వ్యాపారస్తులు వీటిని తీసుకోవటం లేదని, బ్యాంక్ అధికారులకు చెప్తున్నా వినియోదారుల మాటలను బ్యాంకు అధికారులు లెక్కచేయడం లేదు.
రిజర్వ్ బ్యాంక్ వాటిని నిషేధించలేదని, చలామణి కావటానికి బ్యాంకుల ద్వారా వినియోగదారులకు అందిస్తున్నామని, వాటిని దుకాణదారులు వ్యాపారస్తులు వినియోగదారుల నుంచి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే దుకాణదారులు వ్యాపారస్తులు మాత్రం తాము వినియోగదారుల నుంచి పది రూపాయల నాణ్యాలను తీసుకుంటున్న మరికొందరు వినియోగదారులు తామిస్తే తీసుకోవడం లేదని, తమ వద్ద అలాగే మిగిలిపోతున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు పది రూపాయల నాణ్యాలు చలామణి అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అంటున్నారు.