- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NDA vs INDIA: సిటీలకు రాముడు, కృష్ణుడు పేర్లు పెట్టాలన్న సీఎం.. ఇండియా బ్లాక్ ఏం చేసిందంటే..
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఎన్డీఏ, ఇండియా బ్లాక్‌ల మధ్య ఫైట్ మొదలైంది. తాజాగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం సీఎం, ఝార్ఖండ్ బీజేపీ ఎన్నికల ప్రచార సహ ఇంచార్జ్ హిమంత బిస్వ సర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రోజు (శనివారం) ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఝార్ఖండ్‌కి హుసేనాబాద్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడి జిల్లాలు, పట్టణాల పేర్లు రాముడు, కృష్ణుడు, నీలాంబర్, పీతాంబర్ పేర్లతో ఉండాలని, అంతేకానీ ఆ ప్రాంతపు సంస్కృతితో ఏ మాత్రం సంబంధం లేని పేర్లు ఉంటే వాటిని మార్చాల్సిందేనని అన్నారు. కోల్‌కతా పేరు కూడా మార్చారని, ఇక్కడ కూడా అలాంటి పేర్లు మార్చాల్సిందేని, దీనిపై ముఖ్యమంత్రికి కూడా సిఫారసు చేస్తానని బిస్వ సర్మ పేర్కొన్నారు.
ఇక అస్సాం సీఎం చేసిన ఈ కామెంట్స్‌పై ఇండియా కూటమి మండిపడింది. కూటమికి చెందిన ఓ ప్రతినిధిమండలి ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రవికుమార్‌కు దీనిపై ఫిర్యాదు చేసింది. అస్సాం సీఎం బిశ్వ సర్మ వ్యాఖ్యలు ప్రజల్ని వేరు చేసేలా ఉన్నాయని, వారి మధ్య విరోధాన్ని పెంపొందించేలా ఉన్నాయని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అయితే ఈ ఫిర్యాదుపై కూడా హిమంత బిశ్వ సర్మ స్పందించారు. తనపై ఫిర్యాదు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని, తను అన్న మాటల్లో తప్పేంటని ప్రశ్నించారు. తాను అక్రమంగా చొరబడిన వారి గురించి మాట్లాడుతుంటే ఇండియా బ్లాక్ నేతలు ఎందుకు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అక్రమంగా చొరబడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఏ చట్టంలో ఉందో చెప్పాలన్నారు. తాను హిందువుల తరపున మాట్లాడినంత మాత్రాన ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు కాదని చెప్పారు. తాను కనీసం ముస్లిం అనే పేరు కూడా చెప్పనని, భారతదేశం హిందూ సంస్కృతి, సంప్రదాయాలు గల దేశమని, అందువల్ల వాటి పరిరక్షణ గురించి మాత్రమే తాను మాట్లాడానని అన్నారు.