- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Somi Ali: సల్మాన్ ఖాన్‌పై మాజీ ప్రేయసి కామెంట్స్..!!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) మాజీ ప్రేయసి సోమీ అలీ(Somi Ali) తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగానే ఈ నటి గతంలో సల్మాన్ ఖాన్‌కు నిజంగానే బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చింది. సోమీ బాలీవుడ్‌లో నటించినప్పుడు చోటా షకీల్, దావుద్ ఇబ్రీహం గురించి ఎంతో మంది మాట్లాడుకోవడం విన్నానని వెల్లడించింది. వీరిని అండర్ వరల్డ్ అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేవారని తెలిపింది. తర్వాత సల్మాన్ తను మూడేళ్లు డేటింగ్‌లో ఉన్నామని.. గ్యాలెక్సీ నివాసంలో మూడేళ్లు ఉన్నామని, ఓసారి అండర్ వరల్డ్ నుంచి సల్మాన్ కు బెదిరింపు కాల్ వచ్చిందని పేర్కొంది. ఫోన్ ఎవరూ చేశారో క్లారిటీగా తెలియదు.. సల్మాన్ ఖాన్ మాత్రం బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పింది.
సల్మాన్ కు చెప్పు ఆయన లవర్ ను కిడ్నాప్ చేస్తున్నామని అన్నారు. అప్పుడు చాలా భయమేసిందంటూ.. సల్మాన్ కూడా చాలా కంగారు పడ్డారంటూ సోమీ అలీ తెలిపింది. మరీ ఆ పర్సన్ ఎవరని సల్మాన్ ను అడిగానని, తెలుసుకుందామని చాలా ప్రయత్నించానని.. కానీ సల్మాన్ ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటే మంచిదని అన్నారని సోమీ వెల్లడించింది. ఇక సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ (Pakistani American) నటి అన్న విషయం తెలిసిందే. ఈమె మాఫియా(Mafia), ఆందోళన్ (Andolan) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. గతంలో సల్మాన్ అండ్ ఈ నటిని ముఖ్యపాత్రల్లో ఓ మూవీ ప్రకటించారు. కానీ షూటింగ్ దశలో ఉండగానే మూవీ ఆగిపోయింది. ఇక ఆ మూవీ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని నెట్టింట వార్తలు వార్తలు వినిపించాయి.