వందేళ్ల చరిత్ర కలిగిన చర్చిని సందర్శించిన గవర్నర్..

by Sumithra |
వందేళ్ల చరిత్ర కలిగిన చర్చిని సందర్శించిన గవర్నర్..
X

దిశ, మెదక్ ప్రతినిధి : వందేళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత చర్చిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సందర్శించారు. మెదక్ లో రాష్ట్ర గవర్నర్ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన ఆయనకు పోలీస్ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలు పూల బొకే అందజేసి స్వాగతం పలికారు.

అధికారులతో గవర్నర్ మెదక్ లోని ప్రఖ్యాత చర్చిని సందర్శించారు. చర్చి నిర్మాణం జగిగి వందేళ్లు అవుతున్న సందర్బంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. గవర్నర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గవర్నర్ కు పుష్పగుచ్చంతో చర్చి ప్రెస్ బ్రీటరీ ఇంచార్జ్ శాంతయ్య, చర్చి కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. చర్చి ప్రత్యేకతను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అద్భుత నిర్మాణం చూసిన గవర్నర్ అద్భుత నిర్మాణంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed