- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాళ్లకు నచ్చట్లే: ప్రధాని మోడీ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. సోమవారం పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. బెంగాల్‌లో టీఎంసీ గుండాల ఆగడాలు ఎక్కువ అయ్యాయని, పోలీసులు కూడా తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తల బరితెగింపును అడ్డుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువులు జరుపుకునే శ్రీరామనవమి వేడుకలకు కూడా టీఎంసీ ప్రభుత్వం ఆటంకం కల్పించిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రామకృష్ణ మిషన్ కార్యక్రమాలకు కూడా ఇబ్బందులు కల్గిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఎవరెన్నీ ఇబ్బందులు పెట్టినా రామకృష్ణ మిషన్ యాక్టివిటీస్ ఆగవని మోడీ తేల్చి చెప్పారు. హిందువుల సంక్షేమానికి బీజేపీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు దేశంలో ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, ఆదివాసీ మహిళ అయిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చూస్తుంటే వాళ్లకు నచ్చడం లేదని మండిపడ్డారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్, టీఎంసీ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగ మోడీ పిలుపునిచ్చారు.