- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడీని ఇరికించేందుకు నాపై ఒత్తిడి! అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ వైఫల్యాలను ఎదిరించిన వారిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను తప్పుడు కేసులో ఇరికించేందుకు యూపీఏ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. 'న్యూస్ 18 రైజింగ్ ఇండియా' కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. గుజరాత్‌లో జరిగిన నకిలీ ఎన్ కౌంటర్ కేసులో నరేంద్ర మోడీని ఇరికించాలని సీబీఐ నాపై ఒత్తిడి తెచ్చిందన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై స్పందించిన షా.. నిజానికి ఏజెన్సీలను దుర్వినియోగం చేసింది యూపీఏ ప్రభుత్వమే అని ఆరోపించారు. అనర్హత వేటు విషయంలో రాహుల్ గాంధీ పై కోర్టుకు వెళ్లకుండా నరేంద్ర మోడీపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీపై నిందలు మోపే బదులు రాహుల్ గాంధీ తన కేసు విషయంలో పోరాడేందుకు ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని సూచించారు.
అపోహలను ప్రచారం చేసినంత మాత్రాన నేరారోపణ నిలిచిపోదని ఒక వేళ కోర్టు నిర్ణయిస్తే రాహుల్ శిక్షపై స్టే వస్తుంది కదా అన్నారు. యూపీఏ హయాంలో 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, రషీద్ అల్వీ సహా 17 మంది ప్రముఖులు తమ సభ్యత్వాన్ని కోల్పోయారని కానీ వారెవరు నల్ల బట్టలతో సభలలో నిరసన వ్యక్తం చేయలేదన్నారు. ఎందుకంటే ఇది లా ఆఫ్ ది లాండ్ అన్నారు.