- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ.. గతేడాది ఐదుగురు జర్నలిస్టుల హత్య
దిశ, నేషనల్ బ్యూరో: జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే 2023లో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా 226 మందిపై ప్రభుత్వ సంస్థలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు, నేరస్తులు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు కల్పిస్తున్నారు. శుక్రవారం 'ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం' సందర్భంగా ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నేరస్తులు, రాజకీయ ప్రభావం కలిగిన వ్యక్తుల కారణంగా చంపబడిన జర్నలిస్టులలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, అస్సాం, మహారాష్ట్ర, బీహార్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 54 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండగా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్(25), మణిపూర్(22), యూపీ(20), కేరళ(16), జార్ఖండ్(11), మహారాష్ట్ర, తెలంగాణ(8 చొప్పున), అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్(7 చొప్పున), ఛత్తీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, కర్ణాటక, ఓడిశా(5 చొప్పున), ఏపీ, హర్యానా(4 చొప్పున), పంజాబ్(3), త్రిపుర(2), తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్(ఒక్కరు చొప్పున) లక్ష్యంగా చేయబడ్డారు.
దేశవ్యాప్తంగా 30 మంది మహిళా జర్నలిస్టులు అనేక వ్యవహారాల్లో టార్గెట్ చేయబడుతున్నారని నివేదిక తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 12 మంది, కేరళ, మణిపూర్(5 మంది చొప్పున), పశ్చిమ బెంగాల్(3), పంజాబ్(2), ఒడిశా, తెలంగాణ, యూపీ(ఒక్కరు చొప్పున) మహిళా జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీరిలో ముగ్గురు అరెస్ట్ లేదా నిర్భంధానికి గురికాగా, తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇంకా కొందరిపై వ్యక్తిగతంగా దాడి చేయడం, ఇళ్లపై దాడులు వంటి సంఘటనలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది. 'భారత్‌లో రియల్ జర్నలిజం అత్యంత ప్రమాదకరమైన వృత్తిగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం కాకుండా, నియంతృత్వ ప్రజాస్వామ్యానికి మొదటి స్తంభం మారిందని ' ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇనిషియేటివ్ సమన్వయకర్త సుహాస్ చక్మా తెలిపారు. చాలామంది జర్నలిస్టులు అరెస్ట్ చేయడం, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, విచారణ కోసం పిలిపించడం, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడం, ఇళ్లపై దాడులు, నోటీసులు జారీ చేయడం, పోలీసులు, అధికారులు దాడి లేదా బెదిరించడం లేదా వేధించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.