New Governors: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..తెలంగాణకు ఎవరంటే?

by Shamantha N |
New Governors: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..తెలంగాణకు ఎవరంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారని.. మూడు రాష్ట్రాల గవర్నర్లను మార్చినట్లు పేర్కొన్నాయి. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ గవర్నర్ గా హరిబౌ కిషన్ రావు, సిక్కిం గవర్నర్ గా ఓం ప్రకాశ్ మాథుర్, జార్ఖండ్ గవర్నర్ గా సంతోష్ కుమార్ గంగ్వార్, ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా రామెన్ దేకా, మేఘాలయ గవర్నర్ గా విజయ్ శంకర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. కె కైలాష్‌నాథన్‌ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.

బన్వరీలాల్ పురోహిత్ రాజీనామాకు ఆమోదం

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ ను మహారాష్ట్ర గవర్నర్‌గా పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, అసోం గవర్నర్ గా ఉన్న గులాబ్‌ చంద్‌ కటారియా పంజాబ్‌ గవర్నర్‌గా, చంఢీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. పంజాబ్‌ గవర్నర్‌గా, చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న బన్వరీలాల్ పురోహిత్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. సిక్కిం గవర్నర్ గా ఉన్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య అసోం గవర్నర్‌గా నియమితులయ్యారు. లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యకు మణిపూర్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ఈ అపాయింట్‌మెంట్‌లు వారు తమ సంబంధిత కార్యాలయాల్లో బాధ్యతలను స్వీకరించే తేదీల నుండి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed