- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు షాక్.. బెయిల్ నిరాకరించిన కర్ణాటక హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై నిర్ణయాన్ని నెల రోజుల క్రితం రిజర్వ్ చేసింది. తాజాగా తన డిసిషన్‌ను వెల్లడించింది. ప్రజ్వల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అనంతరం హసన్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఆయన జర్మనీ పారిపోయారు. తిరిగి మే 31న ఇండియాకు తిరిగి రాగా వెంటనే ఆయనను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు అందుకు నిరాకరించింది.