ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ కన్నుమూత

by samatah |
ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే పాపులర్ అయిన ప్రముఖ రేడియో వ్యాఖ్యాత అమీర్ సయానీ(91) కన్నుమూశారు. ముంబైలోని తన స్వగృహంలో నివాసముంటున్న సయానీకి మంగళవారం గుండెపోటు రాగా సమీపంలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందినట్టు ఆయన కుమారుడు రాజిల్ సయానీ వెల్లడించారు. దీంతో ముంబైలోని రేడియో శ్రోతల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, 1932 డిసెంబర్ 21న ముంబైలో జన్మించిన సయానీ రేడియో అనౌన్సర్ గా పేరు పొందాడు.1952 నుంచి 1994 మధ్య గీతమాల రేడియో షోకి హోస్ట్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ‘నమస్కార్ భాయియోం ఔర్ బెహ్నో, మెయిన్ ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్’ అంటూ ఎంతో ఎనర్జిటిక్ గా సయానీ వ్యాఖ్యానించేవారు. 1952లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం దాదాపు 42ఏళ్ల పాటు కొనసాగింది. అంతేగాక సయానీ తన పేరు మీద సుమారు 54000 రేడియో కార్యక్రమాలను రూపొందించారు. దాదాపు19,000 జింగిల్స్‌కు వాయిస్ అందించినందుకు గాను లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో సయానీ చోటు దక్కించుకున్నాడు. 2007లో ఆయనకు హిందీ రత్న పురస్కరాం అందజేశారు. 2009లో పద్మశ్రీ పురస్కారం సైతం లభించింది. దీంతో భారత్‌లో ఆల్ ఇండియా రేడియోను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేసిన సయానీకి సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed