త్వరలో అక్కడ కూడా ప్రధాని మోడీ ఫోటో మిస్.. ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-05-05 12:54:38.0  )
త్వరలో అక్కడ కూడా ప్రధాని మోడీ ఫోటో మిస్.. ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ తీసుకున్నవారికి అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రాజెనెకా కంపెనీ అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం కొవిడ్ -19 టీకా తీసుకున్నవారికి ప్రభుత్వం ఇచ్చే కొవిన్ సర్టిఫికేట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు, ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

కొవిన్ సర్టిఫికేట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించారనే వార్తపై.. త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆయన ఫోటో కనిపించకుండా పోతుందని జోస్యం చెప్పారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోటోలు త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా వ్యాక్సిన్ సర్టీఫికేట్‌పై ఫోటో తీసివేశారని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story