- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల బరిలో ఖలిస్తాన్ వేర్పాటువాది.. అమృత్‌పాల్ నామినేషన్‌కు ఈసీ పచ్చజెండా
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ నామినేషన్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖదూర్ సాహెబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మే 10న పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు అమృత్ పాల్. నిబంధనల ప్రకారం అతడికి పంజాబ్ ప్రభుత్వం కూడా సహకరించింది. కాగా.. ఆయన నామినేషన్ ను అంగీకరిస్తున్నట్లు ఈసీ ప్రకటన చేసింది.
ఈ ఖలిస్థానీ అనుకూల నాయకుడిని పంజాబ్ పోలీసులు గతేడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్ అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు. అమృత్ పాల్ తో పాటు అతని తొమ్మిది మంది సహచరులు అదే జైళ్లో ఉన్నారు.
మరోవైపు, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఖలిస్థానీ అనుకూల నాయకులు అమృత్ పాల్ పై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని ఆయన తల్లి బల్వీందర్ కౌర్ ఏప్రిల్ లో మీడియాతో తెలిపారు. శ్రీ ఖదూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఇకపోతే, 2019లో ఖదూర్ సాహిబ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత జస్బీర్ సింగ్ గిల్ గెలిచారు. ప్రస్తుతం ఆ స్థానంలో కాంగ్రెస్ తరఫున కుల్దీప్ సింగ్ జిరా, బీజేపీ నుంచి మంజిత్ సింగ్ మన్నా, ఆప్ నుంచి లల్జీత్ సింగ్ భుల్లర్, అకాలీదళ్ నుంచి విర్సా సింగ్ వాల్తోహా పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. జాన్ 4న ఫలితాలు రానున్నాయి.