కోర్టులో సిసోడియాను మెడ పట్టి లాక్కెళ్లిన పోలీసు

by Mahesh |   ( Updated:2023-05-24 12:42:52.0  )
కోర్టులో సిసోడియాను మెడ పట్టి లాక్కెళ్లిన పోలీసు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో చేదు అనుభవం ఎదురైంది. జైల్లో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాను రూస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళుతుండగా ఒక్కసారిగా జర్నలిస్టులు కెమెరాలతో ఎగబడ్డారు. దీంతో పోలీసులు మనీష్ సిసోడియాను అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు.

కానీ ఆయన జర్నలిస్టులతో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ఓ పోలీసు అధికారి సిసోడియా మెడ వెనుక భాగంలో పట్టుకొని అక్కడ నుంచి దూరంగా లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ఆయన "మనీష్ జీతో ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాగే సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగించారు.

Advertisement

Next Story