ఢిల్లీలో వాహన దారులకు పోలీసుల వార్నింగ్

by samatah |   ( Updated:2023-12-31 05:19:09.0  )
ఢిల్లీలో వాహన దారులకు పోలీసుల వార్నింగ్
X

న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు. అంతేగాక రోడ్లపై ట్రాఫిక్ ని తగ్గించడానికి వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. డ్రగ్స్, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీలో సుమారు 10,000 మంది పోలీసులను, 2500 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించనున్నట్టు తెలుస్తోంది. 250బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నాయి. సవరించిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం.. మద్యం తాగి వాహనం నడిపితే పదివేల రూపాయల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేసే నిబంధన కూడా ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా మోటార్ సైకిల్ విన్యాసాలు చేసినా, వాహనం సామర్థ్యం కంటే ఎక్కువ రైడింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ తెలిపారు. మరోవైపు మెట్రో నగరాలైన ముంబై, చెన్నయ్, హైదరాబాద్‌లలోనూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed