- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ దేశంతో సరిహద్దుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ భారత్ - చైనా బార్డర్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలాకాలంగా ఇరుదేశాల సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అత్యవసరంగా పరిష్కార మార్గాలను వెతకాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగా అడుగులు పడతాయనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, చైనాల మధ్య సుస్థిర బంధం అనేది కేవలం రెండు దేశాలకే కాదు.. యావత్ ప్రాంతానికీ, ప్రపంచానికీ ముఖ్యం’’ అని ఆయన పేర్కొన్నారు. చైనాతో ద్వైపాక్షిక చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘చైనాతో దౌత్య, సైనిక స్థాయిలలో మేం సానుకూల వాతావరణాన్ని కోరుకుంటున్నాం. ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని భావిస్తున్నాం. సరిహద్దులలో శాంతియుత వాతావరణం ఉండాలని మేం కోరుకుంటున్నాం. శాంతిస్థాపనకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం’’ అని ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు.