ఈ నెల 27న శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న పీఎం మోడీ

by Javid Pasha |
ఈ నెల 27న శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న పీఎం మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో నూతనంగా నిర్మించిన శివమొగ్గ ఎవిమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27న ప్రారంభించనున్నారు. పీఎంవో వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 27న పీఎం మోడీ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ క్రమంలోనే శివమొగ్గ, బెలగావి జిల్లాల్లో స్మార్ట్ సిటీ, రైల్వే, రోడ్డు పనులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులను పీఎం మోడీ ప్రారంభిస్తారు. అదే విధంగా జల్ జీవన్ మిషన్ కింద మంచి నీటీ సరఫరా పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇక్కడి నుంచే పీఎం కిసాన్ యోజన 13వ విడుత డబ్బులను ప్రధాని విడుదల చేస్తారు. కాగా రూ.450 కోట్లతో శివమొగ్గ విమానాశ్రయాన్ని నిర్మించారు.

Advertisement

Next Story