- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
PM Modi: టెర్రరిజంపై ప్రధాని మోడీ పవర్‌ఫుల్ స్పీచ్.. పాకిస్తాన్‌కు పరోక్ష వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు భారత ప్రజల్ని ఉగ్రవాదం ప్రశాంతంగా ఉండనివ్వలేదని, కానీ ఇప్పుడు సమయం మారిందని, ఇప్పుడు టెర్రరిస్టులే వాళ్ల ఇళ్లలో సైతం ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రసంగిస్తూ.. ఒకప్పుడు దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు జరిగేవని, కానీ తమ ప్రభుత్వం వాటికి పూర్తిగా దూరంగా ఉంటూ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నామని చెప్పారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలు నమ్మకంతో తమకు ఆ బాధ్యతను అప్పగించారని అన్నారు.
స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రజల్లో రిస్క్ తీసుకుని ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించలేదని విమర్శించిన మోడీ.. గత పదేళ్లలో తమ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి మారిందని, ఇప్పుడు దేశ యువతలో రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 1.25 కోట్ల స్టార్ట్‌అప్ సంస్థలే అందుకు నిదర్శనమని, ఇది దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
అనంతర ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ.. ‘సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్లకు సంబంధించిన నివేదికలను ఎగ్జిబిషన్‌లో చూశాను. ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెను ముప్పుగా ఉండేది. ప్రజలంతా ఎప్పుడూ భయపడుతూ సురక్షితంగా లేరని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు తమ సొంత ప్రదేశాల్లో కూడా సురక్షితంగా లేరు. భయంభయంగా బతుకుతున్నారు. ఇకపై వాళ్లు మనల్ని భయపెట్టలేరు’’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల సొంత ప్రాంతాలు అంటూ మోడీ సంబోధించింది పాకిస్తాన్‌నే అని, ఇది ఆయన పాకిస్తాన్‌ను పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ అని చర్చ జరుగుతోంది.
प्रधानमंत्री मोदी ने #HTLS2024 में कहा, जिस शक्ति ने भारत का भाग्य बनाया है, वो है भारत के सामान्य मानवी की सूझबूझ, उसका सामर्थ्य। जब कोरोना का मुश्किल समय आया तो दुनिया को लगता था कि भारत उन पर बोझ बन जाएगा। लेकिन भारत के नागरिकों ने कोराना के खिलाफ एक मज़बूत लड़ाई लड़कर दिखाई। pic.twitter.com/kkytAKdQQL
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) November 16, 2024