దేవుడి మాయని చెప్పి డబ్బులు మాయం చేసిన మాయలేడి

by Kalyani |
దేవుడి మాయని చెప్పి డబ్బులు మాయం చేసిన మాయలేడి
X

దిశ,జనగామ : నానుడి బలహీనతతో ఆడుకుంటు బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు..ప్రజల నమ్మకాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్లకు కొదవలేదు. ప్రజల బలహీనతను లక్ష్యంగా చేసుకుని, పూజ, హోమం పేరిట వారి నుంచి డబ్బు, విలువైన నగలు లూటీ చేస్తున్నారు. అవి చేతిలో పడగానే మటుమాయం అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మాయ మాటలు చెప్పి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఉడాయించారు. ఓ హిజ్రా..జనగామ జిల్లాలో దోష నివారణ కోసం పూజలు చేస్తామని నమ్మించి ఓ ఇంట్లో నుంచి రూ. 55 లక్షలు కాజేసిన సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. జనగామ పట్టణం వెంకన్న కుంటకు చెందిన (నిఖిల్)బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓ వ్యక్తి తమ అక్క ఇంట్లో దోషం ఉందంటూ బనోత్ నాగదేవి (హిజ్రా) ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామని వాసి పూజలు నిర్వహిస్తే దోషం పోతుందని, ట్యూషన్ టీచర్ నిరోషా చెప్పడంతో వారి మాటలు నమ్మి వారికి క్యాష్, ఫోన్ పే ద్వారా 8 లక్షలతో పాటు విడతలవారీగా పూజలు నిర్వహించడానికి డబ్బులు లక్షల్లో ముట్టజెప్పమని అలాగే 55 లక్షల విలువ గల జనగామ లోని ప్లాటు, దౌల్తాబాద్ లోని ప్లాటు ఇచ్చామని ,కొద్దిరోజుల తర్వాత మాకు ఎలాంటి దోష నివారణ జరగలేదంటూ హిజ్రాను గట్టిగా ప్రశ్నించే సరికి కేరళలో ఉన్న మా గురువు వద్దకు వెళ్లి వస్తానని చెప్పిన హిజ్రా అటే వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 5 గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా వారి నుంచి రూ. 34,36,000 రూపాయలను రికవరీ చేసినట్లుగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. వీరిని పట్టుకోవడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దామోదర్ రెడ్డి ని పోలీసు సిబ్బందిని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed