- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Exam Fee: టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు ఛాన్స్
దిశ, తెలంగాణ బ్యూరో : పదో తరగతి పరీక్ష(Class 10 Exam) ఫీజు గడువు(Fee Deadline)ను అధికారులు పొడిగించారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 28వ తేదీ వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్(Director Of The Government Examination Department) కృష్ణారావు(Krishna Rao) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 జరిమానాతో డిసెంబర్ 10 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 19 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 30 వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాగా గతంలో ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపులకు ఈనెల 18 వరకు అవకాశం కల్పించగా దాన్ని పొడిగించారు. ఎగ్జామ్ ఫీజును ఆయా స్కూల్ హెడ్మాస్టర్లకు చెల్లించాలని, వారు ఎగ్జామినేషన్ డైరెక్టర్‌కు చెల్లిస్తారని కృష్ణారావు వెల్లడించారు. ఇతర వివరాల కోసం https://www.bse.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.