Manipur: మణిపూర్‌ హింసాకాండపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మిజోరాం ప్రభుత్వం

by S Gopi |
Manipur: మణిపూర్‌ హింసాకాండపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మిజోరాం ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు రాష్ట్రం మణిపూర్‌లో గత రెండు వారాలుగా జరిగిన వరుస హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై మిజోరం ప్రభుత్వం శానివారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలను కట్టడి చేసి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఇటీవలి ఘటనల్లో తమ వారిని కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలకు మిజోరాం హోం శాఖ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదిన్నర కాలంగా మణిపూర్‌లో జరుగుతున్న దురదృష్టకర పరిణామాలు ప్రజలకు తీరని బాధలు, కష్టాలు తెచ్చిపెట్టాయి. అల్లకల్లోలం కారణంగా, మణిపూర్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మిజోరంలో ఆశ్రయం పొందారు. మిజోరాం ప్రభుత్వం, ప్రజలు బాధితులకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని ప్రకటన పేర్కొంది. ఇదే సమయంలో మణిపూర్ వివాదానికి సంబంధించి మిజోరంలో మతపరమైన సంఘటనలను ప్రేరేపించే చర్యలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం అభ్యర్థించింది.

Advertisement

Next Story

Most Viewed