- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జాతీయం-అంతర్జాతీయం > DK Shivakumar : స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తా.. మహాయుతి నేతలకు డీకే శివకుమార్ సూచన
DK Shivakumar : స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తా.. మహాయుతి నేతలకు డీకే శివకుమార్ సూచన
by Hajipasha |

X
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక(Karnataka)లో ఐదు గ్యారంటీ స్కీంల అమలును స్వయంగా చూసేందుకు మహాయుతి(Mahayuti) కూటమి నేతలు సిద్ధమైతే.. ప్రత్యేక విమానాలు, వాహనాల ఏర్పాటుకు తాను సిద్ధమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ప్రకటించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు కావడం లేదనే తప్పుడు ప్రచారాన్ని ఇక ఆపేయాలని మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమికి ఆయన సూచించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు, మంత్రులంతా కర్ణాటక పర్యటనకు వస్తే స్వాగతిస్తామన్నారు.
శనివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమలుకు సాధ్యమయ్యే ఎన్నికల హామీలే ఇవ్వండి’ అని ఇటీవలే కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిర్దేశించారు. ఈనేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
Next Story