PM Modi: నేటి నుంచి ఆయుష్మాన్ భారత్.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

by karthikeya |   ( Updated:2024-10-29 07:46:47.0  )
PM Modi: నేటి నుంచి ఆయుష్మాన్ భారత్.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈ రోజు (మంగళవారం) ప్రారంభించనున్నారు. మొత్తం రూ.12,850 కోట్ల విలువైన అనేక పథకాలకు పచ్చ జెండా ఊపనున్న ప్రధాని.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేయనున్నారు.

ఇక ఈ పథకం గురించి మాట్లాడుకుంటే.. ముందు ప్రకటించిన విధంగానే 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కి కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఆయుష్మాన్ భారత్ పథకం తరపున ఇన్యూరెన్స్ కల్పించనుంది. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్ అందించనుంది. ఈ పథకం వల్ల 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది వరకు లబ్ధి పొందనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి సీనియర్ సిటిజన్స్‌‌కి లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed