ఎన్‌‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులకు ప్రధాని మోడీ కీలక సందేశం

by Hajipasha |
ఎన్‌‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులకు ప్రధాని మోడీ కీలక సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : సామాజిక వివక్ష, పేదరికం అనే అవరోధాలను దాటుకుంటూ ఉన్నత స్థానాలకు బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ ఎదిగారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. భారత రత్నగా ఎంపికైన కర్పూరీ ఠాకూర్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొననున్న ఎన్‌‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జన నాయక్ కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర సర్కారు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కర్పూరీ ఠాకూర్ జీవితం గురించి నేటి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆయనను భారతరత్నతో గౌరవించే అవకాశం లభించడం మా ప్రభుత్వం అదృష్టం’’ అని ఆయన చెప్పారు. అణగారిన వర్గాల సాధికారత, సామాజిక న్యాయం కోసం కర్పూరీ ఠాకూర్ యావత్ జీవితాన్ని అంకితం చేశారన్నారు. రెండుసార్లు బిహార్ ముఖ్యమంత్రిగా సేవలందించే అవకాశం దక్కినా.. ఆయన వినయపూర్వక స్వభావాన్ని వదల్లేదని ప్రధాని పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనేది నేటి యువతకు మార్గదర్శక సూత్రంగా మారాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed