100 మిలియన్‌ ఫాలోవర్లతో ప్రధాని మోడీ కొత్త రికార్డు

by S Gopi |
100 మిలియన్‌ ఫాలోవర్లతో ప్రధాని మోడీ కొత్త రికార్డు
X

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే ప్రహానమంత్రి నరేంద్ర మోడీ కొత్త రికార్డులను నమోదు చేశారు. ఆదివారం సోషల్ మీడియా ఎక్స్‌లో మోడీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్(10 కోట్లు) దాటింది. గత మూడేళ్ల కాలంలో దాదాపు 3 కోట్ల మంది ఫాలోవర్లను కొత్తగా మోడీ పొందారని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాను ప్రధాని మోడీ ఎక్కువగా ఉపయోగిస్తారు. పార్టీ కార్యక్రమాలతో పాటు పలు అంశాల గురించి ఆయన పంచుకుంటూ ఉంటారు. 100 మిలియన్ ఫాలోవర్లు అయిన సందర్భంగా ట్వీట్ చేసిన మోడీ.. 'ఎక్స్ ద్వారా చర్చలు, ప్రజల ఆశీర్వాదం, నిర్మాణాత్మక విమర్శలు, ఇతర అంశాలను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తానని' చెప్పారు. 2009లో తొలిసారి మోడీ ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించారు. అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడాది కాలంలోనే లక్షల మంది ఫాలోవర్లను సాధించారు. ఆ తర్వాత ఏడాదికి 4 లక్షలకు, 2020 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించారు. మళ్లీ నాలుగేళ్లకే మొత్తం 10 కోట్ల మంది ఫాలోవర్లను పొందడం విశేషం. గ్లోబల్ లీడర్లలో మోడీకి ఉన్నంత ఫాలోయింగ్ ఎవరికీ లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎక్స్‌లో 3.8 కోట్ల మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలోకి కీలక నేతల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 2.75 కోట్లు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

Next Story