PM Modi: దేశంలో రాంసర్ సైట్ల సంఖ్య పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

by S Gopi |
PM Modi: దేశంలో రాంసర్ సైట్ల సంఖ్య పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో రాంసర్ సైట్ల సంఖ్య పెరగడంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. రాంసర్ కన్వెన్షన్ కింద తమిళనాడు, మధ్యప్రదేశ్‌లలో మూడు సైట్లను చేర్చడంపై ప్రజలను అభినందించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరో మూడు చిత్తడి నేలలను రాంసర్ సైట్లుగా పేర్కొనడం ద్వారా భారత రాంసర్ సైట్లు 85కి పెరిగాయి. మూడు కొత్త సైట్లు తమిళనాడులోని నంజరాయన్ పక్షుల అభయారణ్యం, కజువేలి పక్షుల అభయారణ్యం, మధ్యప్రదేశ్‌లోని తవా రిజర్వాయర్‌లు ఉన్నాయి. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల కేంద్ర మంత్రి పోస్ట్‌పై స్పందిస్తూ.. 'రాంసర్ సైట్ల సంఖ్య పెరగడం దేశానికి నిజంగా సంతోషకరమైన సందర్భం. ఇది స్థిరమైన అభివృద్ధికి, ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. మధ్యప్రదేశ్, తమిళనాడు ప్రజలకు ప్రత్యేక అభినందనలు' అన్నారు. ప్రకృతితో సామరస్యాన్ని నెలకొల్పడం, మన చిత్తడి నేలలను అమృత్ ధరోహర్‌లుగా పిలవడం, వాటి పరిరక్షణ కోసం కృషి చేయడంపై ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యతకు ఈ సాక్ష్యమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed