సిక్కు మ్యూజియంలో నిజ్జర్, గజిందర్ సింగ్ ఫొటోలు ప్రదర్శించాలి..గియానీ రఘ్‌బీర్ సింగ్

by vinod kumar |
సిక్కు మ్యూజియంలో నిజ్జర్, గజిందర్ సింగ్ ఫొటోలు ప్రదర్శించాలి..గియానీ రఘ్‌బీర్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లోని సెంట్రల్ సిక్కు మ్యూజియంలో ఖలిస్తానీ వేర్పాటు వాదులు హర్ధీప్ సింగ్ నిజ్జర్, పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్, గజిందర్ సింగ్‌ల చిత్రాలను ఉంచాలని అకల్ తఖ్త్ జతేదార్ గియానీ రఘ్‌బీర్ సింగ్ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(ఎస్జీపీసీ)ని కోరారు. వారి చిత్రాలను ప్రదర్శించడం ద్వారా వారు చేసిన త్యాగాలు నిరంతరం గుర్తుండి పోతాయన్నారు. గజిందర్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శనివారం ఎస్జీపీసీ, దాల్ ఖల్సా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘గజిందర్ సింగ్‌ ఏనాడూ సిక్కు సూత్రాలపై రాజీపడలేదు. ప్రభుత్వాల ముందు తలవంచలేదు. 2020లో అకల్ తఖ్త్ సాహిబ్ అయన కోసం సిక్కు వారియర్ ఇన్ ఎక్సైల్ బిరుదును ప్రకటించారు. రాబోయే రోజుల్లో తఖ్త్ నుంచి టైటిల్‌ను అతనికి అందించడానికి ఒక వేడుక నిర్వహిస్తాం’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి, శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ చీఫ్ పరమజిత్ సింగ్ సర్నా, మాజీ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్, రాడికల్ సిక్కు సంస్థల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజిందర్ సింగ్ బంధువులను సత్కరించారు. కాగా, సిక్కు నాయకుడు బింద్రన్ వాలేను విడుదల చేయాంటూ 1981లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ విమానాన్ని హైజాక్ చేసిన బృంధానికి గజిందర్ సింగ్ నాయకత్వం వహించారు. ఆనంతరం ఆయన అరెస్టు కాగా 14 సంవత్సరాల జైలు జీవితం గడిపాడు. 1995లో పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇటీవలే ఆయన పాక్‌లో గుండెపోటుతో మరణించారు.

Advertisement

Next Story